![]() |
![]() |
.webp)
ఆహా ఓటిటి వేదిక మీద ఎన్నో షోస్, ఈవెంట్స్ , మూవీస్ ఆడియన్స్ ని అలరిస్తుంటాయి... అలాంటి ఈ ప్లాట్ఫార్మ్ మీద కొన్ని నెలల క్రితం వరకు "చెఫ్ మంత్ర" షో నడిచింది. ఈ చెఫ్ మంత్ర అనే కుకింగ్ షో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ సీజన్ లో యాంకర్ గా శ్రీముఖి అదరగొట్టేసి వెళ్ళిపోయింది. సెకండ్ సీజన్ కు మంచు లక్ష్మీ చేసింది. ఇక ఇప్పుడు థర్డ్ సీజన్ కి మెగా డాటర్ నిహారిక ఎంట్రీ ఇచ్చిది. సోషల్ మీడియాలో నిహారిక మంచి యాక్టివ్ గా ఉంటుంది. నిన్న మొన్నటి వరకు రకరకాల ప్లేసెస్ కి ట్రిప్స్ కి వెళ్లి ఫుల్ ఛిల్ అయ్యి వచ్చింది. ఇప్పుడు నిహారిక చెఫ్ మంత్ర సీజన్ 3 ని హోస్ట్ చేయబోతోంది. దీని ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. "ఈసారి ట్రిపుల్ ఎనెర్జీతో, ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్ తో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం" అని చెప్పింది నిహారిక. ఉమెన్స్ డే రోజున ఈ షో థర్డ్ సీజన్ కి స్టార్ట్ చేయబోతోంది.
అందులో భాగంగానే బలగం బ్యూటీ కావ్య, కలర్ ఫోటో ఫేమ్ చాందినీ చౌదరిని ఈ షోకి ఇన్వైట్ చేసింది. "స్వీట్ గా ఉంటుంది సేమ్యా...అంతకంటే స్వీట్ గా ఉంటుంది మా కావ్య" "బాల్ లా ఉంటుంది భూమి, సూపర్ హిట్ మీ గామి" అంటూ ప్రాస డైలాగ్స్ వేసింది నిహా. ఇక ఈ షోలో స్పెషాలిటీ ఏమిటి అంటే యాదమ్మ రోజు దొంగ రోల్ లో ఈ షోలో నటించాడు. ప్రోమో చివరిలో మంత్రాలు చదువుతూ ఏవో పూజలు చేస్తూ ఉంటాడు. నీహా వచ్చి ఎం చేస్తున్నావురా అని అడిగేసరికి "అక్కా మీరు తపస్సుకు భంగం కలిగించారు..." అన్నాడు. "మంత్రాలు ఎందుకు చదువుతున్నావురా" అని నీహా అడిగేసరికి "చెఫ్ మంత్ర అని పేరు పెట్టావ్ గా అక్క" అనేసరికి తల బాదుకుంది నీహా. నీహా యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, యాంకర్ గా బిజీగా ఉంది. నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో పాటు మంచు మనోజ్ 'వాట్ ది ఫిష్' మూవీలో నటిస్తుంది. అలాగే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ఒక సినిమా కూడా నిర్మిస్తోంది.
![]() |
![]() |